MANA Prathipadu

MANA Prathipadu

Sunday 6 August 2017

రాఖీ పౌర్ణమి

'రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముల్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ

పూర్వం దేవతలకు, రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరుల ను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి
ద్రౌపది -శ్రీకృష్ణుని బంధంసవరించు

ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది, శ్రీకృష్ణుడి కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడి ని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.[2]

మహావిష్ణువు - బలిచక్రవర్తిసవరించు

శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి, తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యి ఏర్పడింది. (ప్రాచీన గాథ " యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల" భావం- ఓ రక్షాబంధమా! మహాబలవంతుడూ, రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)

అలెగ్జాండర్‌ భార్య – పురుషోత్తముడి కథసవరించు

చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్‌)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చి నాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్‌ యుద్ధం విరమించుకుంటాడు.[2]

హయగ్రీవావతారంసవరించు

శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను, శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.

Saturday 22 July 2017

బాలగంగాధర తిలక్ @ మన ప్రత్తిపాడు

బాలగంగాధర తిలక్

कमान्य टिळकజననం23 జూలై 1856
రత్నగిరి, బొంబాయి రాష్ట్రం,బ్రిటిష్ ఇండియామరణంఆగష్టు 1, 1920 (వయసు 64)
ముంబై, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం భారతదేశము)జాతీయతభారతీయుడుజాతిమరాఠీ ప్రజలుసంస్థభారత జాతీయ కాంగ్రెస్ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమంమతంహిందూ

బాలగంగాధర తిలక్ / బలవంత్ గంగాధర్ తిలక్ (Bal Gangadhar Tilak) (మరాఠీ: बाळ गंगाधर टिळक) (జూలై 23, 1856 - ఆగష్టు 1, 1920) ని భారతజాతీయోద్యమ పితగా పేర్కొంటారు. ఆయనకు ముందు జాతీయోద్యమం లేదని కాదు. కానీ ఆయన జాతీయోద్యమాన్ని కొత్తదారులు పట్టించాడు. దేశవ్యాప్తంగా సామాన్యప్రజల్ని ఆ ఉద్యమంలో పాల్గొనేటట్లు చేయడంలో ఆయన పాత్ర అద్వితీయమైనది. అందుకే ఆయన్ను భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేగిన అశాంతికి మూలకారకుడు (Father of India's unrest) గా భావిస్తారు. ఈయనకు లోకమాన్య అనే బిరుదు కూడా ఉంది.

బాల్యంసవరించు

బాలగంగాధర తిలక్ 1856 జూలై 23వ తేదీన మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నగిరిలో జన్మించాడు. ఆయన తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఒక సంస్కృత పండితుడు, మంచి ఉపాధ్యాయుడు. తన బాల్యంలో తిలక్ చాలా చురుకైన విద్యార్థి. ప్రత్యేకించి గణితశాస్త్రంలో ఆయన విశేష ప్రతిభ కనబరచేవాడు. చిన్నప్పటి నుంచి అన్యాయం ఎక్కడ జరిగినా సహించని గుణమాయనది. నిజాయితీతో బాటు ముక్కుసూటితనం ఆయనకు సహజం. కళాశాలకు వెళ్ళి ఆధునిక విద్యనభ్యసించిన తొలితరం భారతీయ యువకుల్లో ఆయనొకడు.

తిలక్ కు పదేళ్ళ వయసున్నప్పుడు ఆయన తండ్రికి రత్నగిరి నుంచి పుణెకు బదిలీ అయింది. ఇది తిలక్ జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చింది. ఆయన అక్కడ ఆంగ్లో-వెర్నాకులర్ పాఠశాలలో చేరి కొందరు ప్రసిద్ధి చెందిన ఉపాధ్యాయుల వద్ద విద్యనభ్యసించాడు. ఐతే పూణెకు వచ్చిన కొంతకాలానికే ఆయన తన తల్లిని, పదహారేళ్ళ వయసులో తన తండ్రిని కోల్పోయాడు. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే ఆయనకు సత్యభామ అనే పదేళ్ళ అమ్మాయితో పెళ్ళయింది. మెట్రిక్ పాసయ్యాక ఆయన దక్కన్ కళాశాలలో చేరాడు. 1877లో ఆయన గణితశాస్త్రంలో ప్రథమశ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆయన తనచదువును కొనసాగించి L.L.B. పట్టా కూడా పొందాడు.

విద్యావిధానంసవరించు

ఆయన పాశ్చాత్యవిద్యావిధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిచాడు - అది భారతీయ సాంస్కృతికవారసత్వాన్ని అగౌరవపరచి భారతీయ విద్యార్థులను చిన్నబుచ్చేవిధంగా ఉందని. ప్రజలకు మంచి విద్యను అందించడం ద్వారానే వాళ్ళను మంచి పౌరులుగా మార్చవచ్చనే ఉద్దేశం ఆయనది. ప్రతి భారతీయుడికి/రాలికి భారతీయ సంస్కృతి గురించి, భారతదేశపు ఔన్నతాన్ని గురించి బోధించాలని ఆయన ఆశయం. అందుకే అగార్కర్, విష్ణుశాస్త్రి చిప్లుంకర్ లతో కలిసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ"ని స్థాపించాడు.

పాత్రికేయవృత్తిలోసవరించు

ఆ తర్వాత తాను నడిపిన పత్రికలు "మరాఠా(ఆంగ్ల పత్రిక)", "కేసరి(మరాఠీ పత్రిక)" లలో మొద్దు నిద్రపోతున్న భారతీయులను మేల్కొల్పడానికి పదునైన భాషలో బ్రిటిష్ పాలనలోని వాస్తవ పరిస్థితుల గురించి వివరంగా రాశాడు. బాల్యవివాహాలను నిరసించి వితంతు వివాహాలను స్వాగతించాడు


హోంరూల్ లీగ్సవరించు

1916 ఏప్రిల్ లో హోంరూల్ లీగ్ను స్థాపించి దాని లక్ష్యాలను వివరిస్తూ మధ్యభారతదేశంలో గ్రామగ్రామానా తిరిగాడు. అనీబిసెంటు అదే సంవత్సరం సెప్టెంబర్లో మొదలుపెట్టి హోంరూల్ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. ఆ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఒక కోర్టుకేసులో ఆయన లండనుకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడే, అంటే 1917 ఆగస్టులో అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటేగు "బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి వీలుగా అన్ని పాలనాంశాల్లో భారతీయులకు అధిక ప్రాధాన్యాన్నివ్వడమే ప్రభుత్వ విధానమని" బ్రిటిష్ ప్రభుత్వం తరపున ప్రకటించాడు. బాధ్యతాయుత ప్రభుత్వమంటే ఎవరికి బాధ్యత వహించే ప్రభుత్వమో, అధిక ప్రాధాన్యమంటే ఎంత ప్రాధాన్యమో, అసలు అది ఎప్పుడిస్తారో ఏదీ స్పష్టంగా లేదు. కానీ బ్రిటిష్ ప్రభుత్వ నిజాయితీని నమ్మిన అనీబిసెంటు ఆ ప్రకటనతో ఉద్యమాన్ని అపేసి ప్రభుత్వానికి తన మద్దతు ప్రకటించింది. అలా ఇద్దరు నాయకులదీ చెరొకదారీ కావడంతో హోంరూల్ ఉద్యమం చల్లబడిపోయింది. కానీ ప్రజల్లో తిలక్ రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగింది. అందుకే 1920లో (ఆగస్టు 1వ తేదీ) తిలక్ చనిపోయినప్పుడు జాతీయోద్యమం చుక్కాని లేని నావ అవుతుందని చాలా మంది భయపడ్డారు.

"గాంధీ అని ఇంకొకాయన ఉన్నాడు గానీ....అబ్బే! తిలక్ ముందర ఏపాటి?" అనుకున్నారు. కానీ "నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది." అనే మాటను నిజం చేస్తూ అతి సామాన్యుడిగా జీవితం ప్రారంభించిన గాంధీ తిలక్ మరణంతో ఏర్పడ్డ శూన్యాన్ని అసామాన్యంగా భర్తీ చెయ్యడమే గాక మహాత్ముడి స్థాయికి ఎదిగాడు.

Friday 14 July 2017

హీరోల‌ను జీరో చేసిన పోలీస్ ఆఫీస‌ర్ అస‌లు ఎవరు

హీరోల‌ను జీరో చేసిన పోలీస్ ఆఫీస‌ర్ అస‌లు ఎవరు..?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీని వ‌ణికిస్తున్న కుంభ‌కోణం డ్ర‌గ్స్ కేసు. ఈపేరు చెబితేనే ప‌లువురు సినీ ప్ర‌ముఖుల్లో ద‌డ పుడుతోంది.దీనికి కార‌ణం ఆ ఐపీఎస్ అధికారే.ఆయ‌న ఎవ‌రో కాదు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కింగ్ అకున్ స‌బ‌ర్వాల్.మోసగాళ్లకు సింహాస్వప్నంగా మారారు.మత్తుగాళ్లను చిత్తు చేస్తున్నారు.నకిలీలపైన ఉక్కుపాదం మోపుతున్నారు.సినిమా పరిశ్రమను గజగజలాడిస్తున్న మొనగాడు.ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తట్టుకొని నిలబడి మత్తుగాళ్ల మొఖాలను జనానికి చెపుతున్నాడు. 
డ్రగ్స్ దందా గుట్టురట్టు చేసి హైదరాబాద్1976 లో పాటియాలాలో జన్మించిన అకున్ సబర్వాల్ దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల అనేక చోట్ల చదవాల్సి వచ్చింది. అకున్ సబర్వాల్ భార్య స్మితా సబర్వాల్ కూడా డైనమిక్ ఆఫీసర్ గా పేరుతెచ్చుకున్నారు. కలెక్టర్ గా ఆమె పనితీరును గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించారు. అకున్, స్మితా దంపతులకు ఇద్దరు పిల్లలు. అకున్ తల్లి ఇటీవలె మరణించారు. మొత్తానికి అకున్ సబర్వాల్ తన పనితీరుతో అనేక మంది మార్గదర్శకంగా నిలుస్తున్నారు. కు పట్టిన పీడను వదిలించేందుకు అకున్ కంకణం కట్టుకున్నాడు. సమాజంలో హీరోలా చలామణి అవుతు రాత్రి వేళలో వారు చేస్తున్న పనులను ఆయన ధైర్యంగా వెలికి తీశారు.గతంలో చాలా మంది ఆఫీసర్లు తీగ లాగి ఆ తర్వాత పక్కన పడేస్తే అకున్ మాత్రం మొత్తం డొంకకదిలించారు.ఆయన దెబ్బకు మత్తుగాళ్ల మత్తు వదిలింది.ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన అకుల్ అక్కడ మావోయిస్టుల నుంచి గట్టి సవాల్ ను ఎదుర్కొన్నారు.ఆయన హయాంలో జిల్లాలో ఏకంగా 28 సార్లు పోలీసులు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగడం విశేషం.అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన డీసీపీగా పనిచేశారు. సౌత్‌ జోన్ డీసీపీగా పనిచేసిన సమయంలో కర్ఫ్యూ కారణంగా ఆయన నెలల తరబడి రోడ్లపైనే పనిచేశారు.తెలంగాణ లో గుడుంబాను నిర్మూలించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ కు ఎక్సైజ్ శాఖ అప్పగించారు.సి.ఎం నమ్మకాన్ని వమ్ము చేయని అకున్ స్వల్పకాలంలో తెలంగాణను గుడుంబా రహితంగా మార్చగల్గారు.తాజాగా డ్రగ్స్ పైన కన్నెసిన ఆయన మొత్తం గుట్టును రట్టు చేశారు.ఆయన పట్టుదలతో మొత్తం డ్రగ్స్ గ్యాంగ్‌ లు పోలీసుల చేతికి చిక్కాయి.డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖులను కూడా అకున్ సబర్వాల్ రోడ్డుపైకి లాగారు. దీంతో ఎప్పుడు లేనంతగా తెలుగు సినిమా పరిశ్రమ షేక్ అయింది. డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ గా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ఆయన కిలీ మందుల ముఠాలను అరికట్టారు.💪

సోర్స్: సోషల్ మీడియా.

గుంటూరు జిల్లాలో పెరగనున్న నియోజకవర్గ లు ఇవే @ మన ప్రత్తిపాడు


రాజకీయ చైతన్యానికి మారుపేరైన గుంటూరు జిల్లాలో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండగానే రాజకీయ నాయకులు వ్యూహప్రతివ్యూహాలు పన్నుతున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచడానికి కేంద్రప్రభుత్వం దాదాపు అంగీకరించడంతో జిల్లాలో నూతనంగా ఏర్పాటు కానున్న నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది. ముఖ్యంగా అధికారపార్టీ నాయకుల్లో ఈ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. నియోజకవర్గాల పెంపుతో పాటు నియోజకవర్గాల డీలిమిటేషన్‌ కూడా ఉండడంతో తమకు బలమైన ప్రాంతాలను తమ నియోజకవర్గంలో కలుపుకుని


తద్వారా రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని సదరు నాయకులు భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా దీనికి మరో 50 నియోజకవర్గాలను జోడించబోతున్నారు. రాష్ట్ర విభజన చట్టంలో నియోజకవర్గాలను పెంచుతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం గత మూడేళ్ల నుంచి దీనిపై దాగుడు మూతలు ఆడుతుంది. నియోజకవర్గాల సంఖ్య పెంచితే తమకు రాజకీయంగా పెద్దగా ఉపయోగం ఉండదనే భావంతో స్థానిక బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పునర్విభజన హామీని అమలు కాకుండా ఇప్పటి వరకూ అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయంపై కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తేవడంతో సదరు ఫైలు హోంశాఖకు చేరింది. దీంతో రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన చట్టానికి సవరణలు చేయడానికి రంగం సిద్దమైంది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో సవరణ చట్టం పాస్‌ అయితే ఆంధ్రాలో 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి. దీనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాలో కనిష్టంగా రెండు గరిష్టంగా ఐదు వరకు పెరిగే అవకాశం ఉంది.

    గుంటూరు జిల్లాలో ఇప్పటికే 17 నియోజకవర్గాలు ఉండగా దీనికి మరో ఐదు కలుస్తాయని అధికారులు, రాజకీయనాయకులు చెబుతున్నారు. గతంలో డీ లిమిటేషన్‌ జరగక ముందు గుంటూరు జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉండేవి. అయితే అప్పట్లో కూచనపూడి, దుగ్గిరాల నియోజకవర్గాలు రద్దు అవడంతో రెండు నియోజకవర్గాలు తగ్గిపోయాయి. అయితే మరో ఐదు నియోజకవర్గాలు జిల్లాకు పెరుగుతాయని భావిస్తుండగా అధికారపార్టీ నాయకులు తమకు బలం ఉన్న చోట ఆ నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. 2009 ఎన్నికలకు ముందు డీలిమిటేషన్‌ వల్ల గరిష్టంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం లాభపడింది. ఇప్పుడు అదే విధంగా తమ ప్రయత్నాలను తాము చేస్తామని అధికారపార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే జిల్లాకు సంబందించి మూడు రెవిన్యూ డివిజన్‌లు ఉండగా పల్నాడు ప్రాంతంలో రెండు, తెనాలి ప్రాంతంలో రెండు, గుంటూరులో ఒక నియోజకవర్గం పెరగబోతోందని సమాచారం. పల్నాడు ప్రాంతంలో 'నకిరకల్లు', పిడుగురాళ్ల'ను నియోజకవర్గంగా ప్రకటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అదే విధంగా గుంటూరులో గుంటూరు గ్రామీణ ప్రాంతం, ప్రతిపాడు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలను కలిపి నూతనంగా నియోజకవర్గం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఇక ఆంధ్రుల రాజధాని అయిన 'అమరావతి'ని మరో నియోజకవర్గంగా ప్రకటించబోతున్నారు. ఇది కాక తెనాలి ప్రాంతంలో 'చెరుకుపల్లి' మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించబోతున్నారని విశ్వసనీయ సమాచారం.

  నియోజకవర్గాల పెంపు, పునర్‌విభజనపై ఇప్పటికే అధికారపార్టీలో కొంత కసరత్తు జరుగుతోంది. పల్నాడు ప్రాంతంలో తమపై ఆధిపత్యం సాధిస్తున్న వైకాపాను దెబ్బకొట్టడానికి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ప్రత్యేక వ్యూహాన్ని రచించారని తెలుస్తోంది. వైకాపాను సమర్థించే బలమైన సామాజికవర్గ ఓటర్ల ప్రభావం తన నియోజకవర్గంపై పడకుండా ఉండేందుకు ఆయన కొత్తగా 'నకిరకల్లు'ను నియోజకవర్గంగా చేసేందుకు పావులు కదుపుతున్నారట. ఇక్కడ స్వంత సామాజికవర్గం బలంతో పాటు, ఇతర బిసీ వర్గాలు బలంగా ఉండడంతో రాజకీయంగా తనకు కలసి వస్తుందని భావిస్తున్నారట. అదే విధంగా ఎప్పటి నుంచో పల్నాడు ప్రాంతంలో ప్రముఖ నగరంగా ఉన్న 'పిడుగురాళ్ల'ను నియోజకవర్గంగా ప్రకటిస్తే ఇక్కడ కూడా అధికారపార్టీ బలం అనూహ్యంగా పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక గుంటూరు గ్రామీణ, పత్తిపాడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలను కలిపితే ఇక్కడా టిడిపి బలంగా తయారైతుందన్న వాదనలు ఉన్నాయి. వాస్తవానికి 'పత్తిపాడు' నియోజకవర్గంలో అధికారపార్టీకి చెందిన సామాజికవర్గం బలంగా ఉన్నా...గుంటూరు గ్రామీణ పట్టణ ప్రాంతం కొంత దానిలో ఉండడంతో ఇక్కడ గతంలో మూడు సార్లు టిడిపి ఓడిపోయింది. ఈసారి దాన్ని ఎదుర్కొనేందుకు అధికారపార్టీ డీలిమిటేషన్‌ అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. రేపల్లె ప్రాంతంలో 'చెరుకుపల్లి'ని నియోజకవర్గంగా చేసి వైకాపాను దెబ్బకొట్టాలని అధికార నేతలు భావిస్తున్నారు. ఇక రాజధాని 'అమరావతి'పై సిఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపించబోతున్నారు. మొత్తం మీద డీలిమిటేషన్‌తో తమ స్థానాలను పదిలం చేసుకోవడానికి...మరింత బలం పుంజుకోవడానికి అధికారపార్టీ సన్నాహాలు చేస్తోంది. చూద్దాం ఏమి జరుగుతుందో...!

Tuesday 4 July 2017

అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలు @ మన ప్రత్తిపాడు

అల్లూరి సీతారామరాజు:
బ్రిటిషు పాలకులను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు
భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (జూలై 4, 1897 - మే 7, 1924) (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడు.
వంశంసవరించు:
సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూరివారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటిలంక గోదావరిలో మునిగిపోవడంవల్ల అక్కడి అల్లూరి వారు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచోట్లకు వలస వెళ్ళారు. ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరపడ్డాడు. ఇతనికి ఆరుగురు కుమారులు -- వెంకట కృష్ణంరాజు, సీతారామరాజు, గోపాలకృష్ణంరాజు, వెంకట నరసింహరాజు, అప్పలరాజు, వెంకట రామరాజు. వీరిలో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణంరాజు (సీతారామరాజుకు తాత), వెంకటకృష్ణంరాజు మరియు అతని పెదతండ్రి వెంకట నరసింహరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరపడ్డారు. వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడుకులు రామచంద్రరాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు.[1]
అల్లూరి సీతారామ రాజు 1897 జూలై 4 న పాండ్రంగి (పద్మనాభం) గ్రామంలో వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మ లకు జన్మించాడు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె (ఆమె భర్త దంతులూరి వెంకటరాజు), సత్యనారాయణరాజు అనే మరొక కుమారుడు కూడా ఉన్నారు.
అల్లూరి సీతారామరాజుగా ప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలుపేరు "శ్రీరామరాజు". ఇతని తాత (మాతామహుడు) అయిన మందపాటి రామరాజు పేరే ఇతనికి పెట్టారు. అతని ఉత్తరాలలోను, మనుచరిత్ర గ్రంథం అట్టపైన కూఢా "శ్రీరామరాజు", "అల్లూరి శ్రీరామరాజు" అని వ్రాసుకొన్నాడు. కాలాంతరంలో ఇతనికి "సీతారామరాజు" అనే పేరు స్థిరపడింది. (సీత అనే పడతి ఇతనిని ప్రేమించిందని. ఇతడు సంసార బాధ్యతలను స్వీకరించడానికి నిముఖుడైనందున ఆమె మరణించిందని, కనుక అతను తన పేరును "సీతారామరాజు"గా మార్చుకొన్నాడని వ్యావహారిక గాథ.)విప్లవం రెండవదశసవరించు
డిసెంబర్ 6 న విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. జాన్ ఛార్సీ, మరికొందరు అధికారుల నాయకత్వంలో ప్రభుత్వ సైన్యానికి, రాజు సైన్యానికి పెదగడ్డపాలెం వరిచేలలో పోరాటం జరిగింది. ప్రభుత్వసేనలు శక్తివంతమైన శతఘ్నులను (ఫిరంగులను) ప్రయోగించాయి. ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో 4మంది రాజు అనుచరులు చనిపోయారు. కొన్ని ఆయుధాలు పోలీసుల వశమయ్యాయి. తప్పించుకొన్న విప్లవవీరుల స్థావరంపై ప్రభుత్వదళాలు ఆరాత్రి మళ్ళీ దాడి చేశాయి. ఒక గంట పైగా సాగిన భీకరమైన పోరులో మరొక 8 మంది విప్లవకారులు మరణించారు.
ఆ తరువాత దాదాపు 4 నెలలపాటు దళం స్తబ్దుగా ఉండిపోయింది. రామరాజు చనిపోయాడనీ విప్లవం ఆగిపోయిందనీ పుకార్లు రేగాయి. అయినా అనుమానం తీరని ప్రభుత్వం రామరాజును, ఇతర నాయకులను పట్టి ఇచ్చిన వారికి బహుమతులు ప్రకటించింది. స్పిన్, హ్యూమ్ వంటి అధికారులు జాగ్రత్తగా వ్యూహాలు పన్నసాగారు.
1923 ఏప్రిల్ 17న రాజు కొద్దిమంది అనుచరులతో అన్నవరంలో ప్రత్యక్షమయ్యాడు. పోలీసు స్టేషనుకు వెళ్ళారు. పోలీసులు లొంగిపోయారు గానీ స్టేషనులో ఆయుధాలు మాత్రం లేవు. తరువాత రాజు అనుచరులతో పాటు కొండపైకి వెళ్ళి సత్యనారాయణస్వామిని దర్శించుకున్నాడు. పత్రికా విలేఖరులతో కూడా మాట్లాడాడు. చెరుకూరి నరసింహమూర్తి అనే అతనికి, రాజుకు జరిగిన సంభాషణ 21-4-1923 ఆంధ్ర పత్రికలో ప్రచురింపబడింది. 10 గంటలకు బయలుదేరి శంఖవరం వెళ్ళాడు. అక్కడి ప్రజలంతా రాజును భక్తిగా ఆదరించారు. రాజు వచ్చిన విషయం తెలిసిన కలెక్టరు అన్నవరం వచ్చి, రాజును ఆదరించినందుకు ప్రజలపై (4,000 రూపాయలు జరిమానా) అదనపు పన్నును విధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి "నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను. నన్ను కలవవలసినది" అని కలెక్టరుకు రాజు "మిరపకాయ టపా" పంపాడు. కాని కలెక్టరు రాజును కలవడానికి సాహసించలేదు. (ఈ విశేషాలు 19-4-1923 హిందూ పత్రికలో ప్రచురింపబడ్డాయి.)
క్రమంగా రాజు దళానికి, ప్రభుత్వ దళాలకు వైరం తీవ్రరూపం దాల్చింది. ఎలాగైనా రాజును పట్టుకోవాలని ప్రభుత్వం అనేక గూఢచారుల ద్వారా ప్రయత్నిస్తోంది. తమను అనుసరిస్తున్న గూఢచారులను రాజు దళాలు హెచ్చరించడం లేదా శిక్షించడం జరుగసాగింది. ప్రజలలో ఇరువర్గాల మనుషులూ ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్నారు. సి.యు.స్వినీ అనే అధికారి ఏజన్సీ భద్రతలకు బాధ్యుడైన అధికారిగా జూన్‌లో నియమితుడయ్యాడు. గాలింపు తీవ్రం చేశాడు. విప్లవకారులు 1923 జూన్ 10న ధారకొండ, కొండకంబేరు మీదుగా మల్కనగిరి వెళ్ళి పోలీసు స్టేషను, ట్రెజరీపై దాడి చేసారు కాని అక్కడ మందుగుండు సామగ్రి లేదు. ముహూర్తం పెట్టి జూన్ 13న ప్రభుత్వ సైన్యంతో తాను పోరాడగలనని, ప్రభుత్వాన్ని దించేవరకు పోరాటం సాగిస్తానని రాజు అక్కడి డిప్యూటీ తాసిల్దారు, పోలీసు ఇనస్పెక్టరులకు చెప్పాడు. ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసికొని ధారకొండ వెళ్ళాడు.
జూన్ 17న రాజు ఒకచోట బస చేసినట్లు ఒక ఉపాధ్యాయడు స్వినీకి వార్త పంపాడు. సైనికులు రాలేదు గాని ఈ విషయం తెలిసిన మల్లుదొర, గంటందొర నాయకత్వంలో విప్లవవీరులు ఈతదుబ్బులు గ్రామానికి వెళ్ళి, తమ ఆచూకీ తెలిపినందుకు అక్కడివారిని బెదరించి నానాబీభత్సం చేశారు. జూలై 29న ప్రభుత్వ సైన్యాలకు ఆహారపదార్ధాలు తీసుకెళ్ళే బండ్లను విప్లవవీరులు కొల్లగొట్టారు. ఆగష్టు 4న పెదవలస పోలీసు శిబిరానికి వెళ్ళే పోలీసులను పట్టుకొన్నారు. ఆగష్టు 11న కొమ్మిక గ్రామంలోను, ఆగష్టు 20న దామనూరు గ్రామంలోను ఆహార పదార్ధాలు సేకరించారు.
2-9-1923న రామవరం ప్రాంతానికి కమాండర్‌గా ఉన్న అండర్‌వుడ్ సైనికులకు, మన్యం వీరులకు భీకరమైన పోరాటం జరిగింది. సెప్టెంబర్ లో రాజు ముఖ్య అనుచరుడైన గాము మల్లుదొర పోలీసులకు దొరికిపోయాడు. ఇతను మహా సాహసి. కాని త్రాగుడు, వ్యభిచారం వ్యసనాలకు బానిస. ఒకమారు త్రాగి పోలీసులకు దొరికిపోగా రాజు దళం విడిపించింది. అతనిని దళం విడచి పొమ్మని రాజు ఆనతిచ్చాడు. అలా దళానికి దూరమైన మల్లుదొర తన ఉంపుడుగత్తె ఇంటిలో ఉండగా 17-9-1923న అర్ధరాత్రి దాడిచేసి అతనిని సైనికులు నిర్బంధించారు. తరువాత శిక్షించి అండమాన్ జైలుకు పంపారు (1952లో మల్లుదొర పార్లమెంటు సభ్యునిగా విశాఖపట్నం నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1969లో మరణించాడు). విప్లవాన్ని అణచివేసే క్రమంలో పోలీసులు ప్రజలను భయభ్రాంతులను చేసారు. గ్రామాలోకి ప్రవేశించి, చిత్రహింసలకు గురిచేసారు. మన్యాన్ని దిగ్బంధనం చేసారు. ప్రజలకు ఆహారపదార్థాలు అందకుండా చేసారు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనే విచక్షణ లేకుండా చంపారు.
సెప్టెంబరు 22న విప్లవకారులు పాడేరు పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. 20వ తేదీన రాజు నాయకత్వంలో ఎర్రజెర్లలో ఉన్నపుడు పోలీసులు అటకాయించి కాల్పులు జరిపారు. ఒక గ్రామమునసబు ఆ పోలీసు దళాలను తప్పుదారి పట్టించడంవల్ల వారు తప్పించుకోగలిగారు. అక్టోబరు 26న గూడెం సైనిక స్థావరంపై దాడి చేశారు కాని స్టాండునుండి తుపాకులు తీసే విధానం తెలియక ఒక్క తుపాకీని కూడా చేజిక్కించుకోలేకపోయారు.@ మన ప్రత్తిపాడు!!  Fb/prathipadu.

Monday 3 July 2017

అనగనగా ఓ ప్రత్తిపాడు @ mana prathipadu


అనగనగా ఓ ప్రత్తిపాడు.
సంభాషణ:
"సుబ్బయ్య మావా! ఇంకా ఎందుకే ఈ వయసులో నీకీ కట్టం. కొడుకు అవిద్రాబాదులో( హైదరాబాద్) పెద్ద ఉద్దోగం సేత్తన్నాడుగా... కమ్మగా ఆడికి బోయి కాలుమీన కాలుసేకుని కమ్మగా రేయింబొగుళ్లు టీవీ సూత్తూ, కోడల పిల్ల సేతి తిండి తింటూ పేణం ఉన్నెంతె కాలం హాయిగా బతుకొచ్చుగా" అన్నాడు సూరయ్య...సూరయ్య మాటలు విని ఎప్పటిలాగే సమాధానంగా ఓ బలహీనమైన నవ్వు నవ్వి ఇంటికొచ్చి పాత నులక మంచంపై నడుము వాల్చాడు సుబ్బయ్య. "ఏందీ ఈ పొద్దుటేల శానా నీరసంగా ఉండాది" అనుకుంటూ కళ్లు మూశాడు.కళ్ల ముందు గతం తాలూకు జ్ఞాపకాల దొంతరలు కదిలాయి. ఈ ఊర్లోనే తను పుట్టి పెరిగింది. ఆ ఊరు నుంచే పట్నానికి మైళ్ల దూరం నడిచి బడికెళ్లి చదువుకుంది. పదవ తరగతి పక్క ఊర్లో ఉండి చదువుతానంటే నాన్న... " సదివింది సాలు.. ఈ ఊళ్లో నీకేం తక్కువా? ఇట్టమైన పని సేసుకుని దరిజాగా బతుకు" అనేవాడు. ఎప్పుడైనా కోపంలో ఊరొదిలి వెల్దామంటే... "ఎవురినైనా కన్న ఊరు, కన్నతల్లేరా కట్టాల్లో ఆదుకునేది" అంటూ గుర్తు చేసేవారు. నాన్న చెప్పినట్లే ఏ కష్టమొచ్చినా తీర్చింది ఈ ఊరే. ఈ ఊర్లోనే 50 ఏళ్ల క్రితం గుర్తుగా తమ కాంతి వెలుగు చంద్రం పుట్టింది.ఇంకా ఆనాటి ఆ దృశ్యం కళ్ల ముందు కదులుతూనే ఉంది. అనారోగ్యంతో తన సీతామాలక్ష్మి పడిన బాధ నేటికీ గుండెను పిండుతుంది. అదేదో పెద్ద జబ్బు పట్నం వెళ్తే ఫలితం ఉండొచ్చు అంటూ నాటు వైద్యుడు చెప్పినప్పుడు సీత తన చెయ్యి పట్టుకుని తీసుకున్న ఒట్టు... ఇంకా గుర్తు ఉంది. ఆ చేతి స్పర్శ వెచ్చగా... గుర్తొస్తూనే ఉంటుంది."అయ్యా! నాను పెట్నమెల్లి వైద్దిగం సేయించుకన్నంత మేత్రేన బతుకుతాననే ఆశ నేదు. ఈ వైద్దిగం సంగతి దెలిత్తే మన సెంద్రం సదువు మానేసి ఆ డబ్బులతో నన్ను బతికింసుకుందామని పాకులాడతడు. ఆడి సుదువు సట్టు బండలు గాకూడదు. మనలా సదువు లేని వారిలా ఆడు ఉండకూడదు. ఈ ఊళ్లోకి ఒక్కడైనా సదువు సెప్పే మడిసి రావాలి. అది మన సెంద్రమే గావాల" అంటూ అలాగే జబ్బుతో కన్ను మూసింది.సీత అన్నట్లే చంద్రం ఈ రోజు ఉన్నత స్థానంలో ఉన్నాడు. గతంలో తన కోరిక చెపితే... "ఏంటి నాన్నా నా కలల్ని చంపుకుని నీ లాగే నన్ను ఈ ఊర్లో ఉండమనడం నీ స్వార్థం" అని తేలిగ్గా కొట్టిపడేశాడు. కావాలంటే నువ్వు నాతో రా... అంటున్నాడు.ఆడు పిలిత్తే మేత్రం ఎట్టా ఎల్తాను. నా (నేల)తల్లిని వొదిలి. ఈడే అమ్మా, అయ్యా కూలి సేసి తనను రాజులా సాకారు. ఈడే నా సీతామాలచ్చి కట్టంలో, సుఖంలో రారాజులా సూసుకుంది. ఆడికి మేత్రం ఇది పనికిమాలిన పల్లెటూరు. కానీ నాకు తెలుసు. ఇది నా పేణం. పేణం వొదిలి నేనెట్టా ఎళ్తాను.ఎల్లనుగాక ఎల్లను అని గట్టిగా బయటికి అంటూ... తన రిక్షా తీసుకుని బయలుదేరాడు పక్క ఊర్లోని బడి పిల్లలను తీసుకురావడానికి...ఎందుకంటే తన ముందు తన సీతామాలక్ష్మి కల ఇంకా సజీవంగానే ఉంది. తను తన రిక్షాలో తీసుకెళ్లే పిల్లల్లో ఒక్కరైనా తన ఊరికి చదువు సెప్పే మేస్టారు కాకపోతారా... తన సీత కోరిక తీరకపోతుందా అనే ఆశతో. @ mana prathipadu.

Sunday 2 July 2017

ఆ రోజులే బాగున్నాయి @ మన ప్రత్తిపాడు

       
సండే స్టోరీ @ మన ప్రత్తిపాడు
 ఆ రోజులే బాగున్నాయి !!👌
  👉టెన్షన్స్,వత్తిళ్ళు, డబ్బు సంపాదన ఇలాంటి అతిగా ఆలోచనలు లేకున్నా.ఉన్నంతలో కుటుంబం అంతా కలసి ఆనందంగా గడిపిన ఆ రోజులే బాగున్నాయి. ఆదివారం ఆటలు ఆడుతూ ఆనందాన్ని మరచినా ఆ రోజులే బాగున్నాయి. మినరల్ వాటర్ కొనుకోలేక కుళాయి దగ్గర బోరింగులదగ్గర బావుల దగ్గర నీళ్లు తగిన ఆ రోజులే బాగున్నాయి.ఎండాకాలం చాలివేంద్రం లోని చల్లని నీరు కోసం  ఎర్రని ఎండని సైతం లెక్క చెయ్యని ఆ రోజులే బాగున్నాయి. వందల కొద్దీ ఛానళ్లు లేకున్నా ఉన్న ఒక్క దూరదర్శన్ లో శుక్రవారం చిత్రలహరి ఆదివారం సినిమా కోసం ఎదురుచూసిన ఆ రోజులే బాగున్నాయి.సెలవుల్లో అమ్మమ్మ,నాన్నమ్మ ఊళ్లకు వెళ్లి ఇంటికి రావాలని ఆలోచనే లేని ఆ రోజులే బాగున్నాయి. మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా బర్త్డే  డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ చాకలెట్లు పంచిన ఆ రోజులే బాగున్నాయి.మట్టున్ బిరియాని,చికెన్ బిరియాని లేకున్నా ఎండాకాలం వచ్చింది అంటే మామిడికాయ పచ్చడితో అందరం కలిసి కడుపు నిండా అన్నం తిన్న ఆ రోజులే  బాగున్నాయి. ఇప్పుడు జేబు నిండా,కార్డ్ నిండా డబ్బులుఉన్న అమ్మ కొట్టుకు పంపినప్పుడు చిల్లర కాచేసి కొన్నుకొని తిన్న ఆ రోజులే బాగున్నాయి.ఇప్పుడు చేతిలోని సెల్ నిండా గేమ్స్ ఉన్నా ఆటస్థలంలో ఒక్క బ్యాటు తో బ్యాటు  మార్చుకుంటూ క్రికెట్ ఆడిన ఆరోజులే బాగున్నాయి. బీరువా నిండా జీన్స్ ప్యాంట్లు,టీ షీర్ట్లు ఉన్న 2,3 నిక్కర్లతో కురచ చొక్కాలతో బడికి వెళ్లిన ఆ రోజులే బాగున్నాయి.ఇప్పుడు బ్యాకరీల్లో కూల్ కేక్లు తింటున్న 25 పైసల ఆశ చాక్లెట్లు తిన్నా ఆ రోజులే బాగున్నాయి.ఇప్పుడు రక రకాల ఐస్క్రీమ్ లు నోట్లో నానుతున్న అమ్మమ్మ నాయనమ్మ ల చేత చీర కొంగు లోనుంచి పుల్ల ఐసు కొనుక్కొని తిన్న ఆ రోజులే బాగున్నాయి పొద్దు పోయేదాకా పాపం పనులు చేసుకొని ఎలాంటి చిరాకు లేకుండా ఇంటికి చేరుకొని  చందమామని చూస్తూ నిద్రలోకి వెళ్తూ కలలు కన్న ఆ రోజులే బాగున్నాయి. ఏమైనా ఆ రోజులే బాగున్నాయి మిత్రమా !! @మన ప్రత్తిపాడు. fb/prathipadu.